నేటి నుంచి ప్రారంభమైన ఒక్క పూట బడి

నేటి నుంచి ప్రారంభమైన ఒక్క పూట బడి

హైదరాబాద్, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు.

పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంట వరకు క్లాసులు జరగనున్నాయి. వేసవి కాలం నేపథ్యంలో ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండి పోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం తో.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటిపూట బడులు నిర్వహించడానికి నిర్ణయించింది.

ఈరోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవు తుండగా.. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment