పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్షలు జరిగే ప్రదేశాలలో ఆ సమయానికి (144) సెక్షన్ అమలు

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
9492585375,

మాహబూబాబాద్, మార్చి15, సమర శంఖం ప్రతినిధి:-  జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షలపై రెవెన్యు అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారీ , సంబందిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పది పరీక్షలకు (46) సెంటర్లలో బాయ్స్ (4189), గర్ల్స్ (4005), మొత్తం (8194) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు.

అలాగే ఎక్కడా కూడా మాస్ కపింగ్ కు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సెల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు అనుమతించరాదన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా కూడా తప్పులు దొర్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం వంటి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. పోలీస్ ఎస్కార్ట్ తో వెహికల్ లో మాత్రమే పరీక్ష పేపర్లను తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సెంటర్ కు ఇద్దరు ఏఎస్ఐలు, ఒక సబ్ సెంట్రీతో బందోబస్తు నిర్వహించాలన్నారు.

పరీక్ష కేంద్రాలకు కాంపౌండ్ వాల్ లేని వాటికి బారికేడ్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశాలను నియమించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు వచ్చే విధంగా బస్సుల సౌకర్యం కల్పించాలన్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని తెలిపారు.

హాల్ టికెట్ల డౌన్లోడ్ విషయం, సెంటర్ల వివరాలు తదితర అంశాల కోసం జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు 9492585375 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తొర్రూరు ఆర్దేఒ గణేష్, డీఈఓ డాక్టర్ రవీందర్ రెడ్డి,  డిపిఓ హరిప్రసాద్, ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, మహబూబాబాద్, తొర్రూర్ మున్సిపల్ కమిషనర్లు శాంత కుమార్, రవీందర్, డిపోస్టల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ వారిచే జారీ చేయనైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment