ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు పిక్సీడ్ వేతనం నిర్ణయించాలి

అసెంబ్లీ
---Advertisement---

ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు పిక్సీడ్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్సడ్ వేతనం18 వేల రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యల పై కోఠిలో జరిగిన ధర్నాలో ఇప్పటి ప్రభుత్వం చాలా సమస్యలను పరిష్కరిస్తామని, దానికి ప్రత్యేకంగా కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాన్ని తగిన ప్రతిపాదనలు పంపి విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ తొమిదిన ఆశా వర్కర్ల నిర్వహిక సమ్మెను విరమించారు. సమస్యలు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి గత 15 రోజుల సమ్మె కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో పొందుపరిచిన హామీలు విభజన చలో కోఠి లో కమిషనర్ గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు

అసెంబ్లీ
చేయాలాన్నారు. రిటర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలకు చెల్లించాలని, ప్రస్తుతం ఇస్తున్న పారితోషకాల్లో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలన్నారు. పండుగ సెలవులు కల్పించాలని, ఆశలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనం పాటు కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ఆశలకు 6నెలల వేతనం కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి,
ఏఎన్ఎం పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎం, జీఎం పోస్టుల ప్రమోషన్ కల్పించాలన్నారు. వెయిటేజ్ మార్కులు వెంటనే నిర్ణయించాలి గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రస్తుత సెలవులు ప్రకటిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి వెంటనే చెల్లించాలన్నారు. 2002, 2003, 20024 సం” ఇప్పుడు చేసిన సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి, జిల్లా అధికారులు ఆశలతో స్కూటీమ్ డబ్బులను కట్టించకూడదని పైనుండి నిర్దిష్టమైన సర్కులర్ జారి చేయాలన్నారు.

అసెంబ్లీ
ఇప్పటివరకు లేని హాస్పిటల్లో వెంటనే ఆశలకు రెస్టురూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పాత సర్కులర్ గార్డెన్స్కు భిన్నంగా ఏఎంసీ, పిఎంసి తదితర టార్గెట్స్ పెట్టే విధానం రద్దు చేయాలని, ఆశాలకు ఇష్టం లేని పనులు చేయించ రాదు అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కే రాజనర్సు, ఆశా వర్కర్స్ యూనియన్అధ్యక్షులు ఇంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశ్రీ, నాయకులు
గంగవని, నశ్రీం, కామేశ్వరి, మమత, పద్మ, శశికళ, కవిత, భాగ్యలక్ష్మి, అనిత, సావిత్రి, సుజాత, అమల, విజయ, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment