పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..

పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..

నల్గొండ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-పందులు చోరీ చేస్తున్నారని రెండు వర్గాల మధ్య నడిరోడ్డు పై పంచాయతీ కలకలం రేపింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లో చోటు చేసుకుంది.

పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురంకు చెందిన తమ పందులను చోరీ చేసి మరొక చోట విక్రయిస్తున్నారని అనుమానంతో మరో గ్రూపుకి చెందిన వ్యక్తి పిడిగుద్దులు గుద్దుతు దాడి చేయడంతో నడి రోడ్డు పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఓ గ్రూపునకు చెందిన వ్యక్తిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హోలీ పండుగ రోజు నడిరోడ్డు పై చోటుచేసుకుంది.. ఇరు వర్గాలు పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ శివశంకర్ కేస్ నమోదు చేసినట్లు తెలిపారు. రహదారిపై రెండు వర్గాలు దాడులకు దిగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment