ఓయూ అధికారులు వెంటనే సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి: చెరుకు శివ కుమార్ గౌడ్

ఓయూ అధికారులు వెంటనే సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి: చెరుకు శివ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఓయూ లో అధికారులు ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర్య MLA అభ్యర్థి చెరుకు శివ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిషేదిస్తూ ఓయూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు.

అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్న పాలన వ్యవస్థలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రథమ ప్రతి పక్షంగా వ్యవహారిస్తూ, ప్రజా గొంతుకగా ప్రజల వాదన వినిపించిందని గుర్తు చేశారు.

ఇప్పుడు ధర్నాలు, నిరసనలు చెయ్యొద్దని నిషేదిస్తే, ప్రభుత్వాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు, అధికారులు తమ విధులను సరిగ్గా వ్యవహారిస్తే ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకోస్తుందని ప్రశ్నించారు.

రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి దేశానికి దిక్సూచి ఐన ఓయూ లో అధికారులు ఆంక్షలు విధిస్తూ, విద్యార్థుల హక్కులని హరిస్తూ అప్రజాస్వామిక వాతావరణం తీసుకోస్తున్నారని దుయ్యబట్టారు. దీని వల్ల ప్రభుత్వానికే నష్టం అని ఓయూ అధికారులు వెంటనే సర్కులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment