అవయవదానానికి ముందుకొచ్చిన కెటిఆర్ – అసెంబ్లీలో చారిత్రక నిర్ణయం

అవయవదానానికి ముందుకొచ్చిన కెటిఆర్ – అసెంబ్లీలో చారిత్రక నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో అవయవదానం బిల్లుపై జరిగిన చర్చలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) తన అవయవాలను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సభా మండపంలో ప్రకటించారు.

“మనం ప్రజలకు సేవ చేసే ప్రతినిధులం. సమాజానికి ఆదర్శంగా నిలవడం మన బాధ్యత,” అని కెటిఆర్ సభను ఉద్దేశించి అన్నారు. ప్రజల్లో అవయవదానం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా, శాసనసభ ప్రాంగణంలోనే అవయవదానానికి సంతకాల సేకరణ చేపట్టేలా స్పీకర్‌కు సూచించారు. “ఈ మహత్తర కార్యానికి ముందుగా తానే సంతకం చేస్తాను” అని స్పష్టంగా ప్రకటించారు.

అవయవదానం అనేది మరెంతో మందికి కొత్త జీవితం ఇవ్వగల గొప్ప మానవీయ చర్య అని పేర్కొన్న కెటిఆర్, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment