తెలంగాణ జిల్లాల్లో మండుతున్న ఎండలు

తెలంగాణ జిల్లాల్లో మండుతున్న ఎండలు

హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే, ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం అయితేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. బయటకు వెళ్ళినప్పుడు టోపీ, గొడుగులు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు.

కాగా, నేటి నుంచి మరో మూడు రోజుల పాటు మరింత ఎండ వేడిమి పెరిగే ఛాన్స్ ఉంది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రం లో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment