ముంబై ఇండియన్స్‌లోకి కొత్త స్పిన్నర్ రఘు శర్మ
ముంబై ఇండియన్స్ జట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో, అతని స్థానంలో పంజాబ్‌కు చెందిన లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ రఘు శర్మను ఎంపిక చేసింది.
రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో జట్టులోకి వచ్చిన రఘు, 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 19.59 యావరేజ్‌తో 57 వికెట్లు సాధించిన అనుభవజ్ఞుడు. ఈ రోజు జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో రఘు శర్మ ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. అతని ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.