భారత నౌకాదళం యుద్ధనౌకలను హై అలర్ట్ లో ఉంచింది

భారత నౌకాదళం యుద్ధనౌకలను హై అలర్ట్ లో ఉంచింది

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతల మధ్య, భారత నౌకాదళం అరేబియా సముద్రంలో తన సైనిక కార్యకలాపాలను గణనీయంగా ముమ్మరం చేసింది. అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌకలు సమగ్ర విన్యాసాలు నిర్వహిస్తూ, అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి.గత కొన్ని రోజులుగా అరేబియా సముద్రంలో భారత నేవీ యుద్ధనౌకలను హై అలర్ట్ లో ఉంచారు. ఈ ప్రాంతంలో ముప్పులను నిరోధించడానికి, యుద్ధ సంసిద్ధతను ప్రదర్శించడానికి ఇటీవలే పలు యాంటీ-షిప్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఫైరింగ్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. “యుద్ధనౌకలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. పోరాట సంసిద్ధతను చాటేందుకు, ఈ ప్రాంతంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఇటీవల పలుమార్లు నౌకా విధ్వంసక, విమాన విధ్వంసక అస్త్రాలను ప్రయోగించాయి” అని పేర్కొన్నాయి.అంతేకాకుండా, గుజరాత్ తీరం వెంబడి అంతర్జాతీయ సముద్ర సరిహద్దుకు సమీపంలోని కీలక ప్రాంతాలలో భారత తీర రక్షక దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా తన నౌకలను మోహరించింది. నిఘాను మరింత పటిష్టం చేసేందుకు కోస్ట్ గార్డ్, నౌకాదళంతో కలిసి సమన్వయంతో పనిచేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఇటీవల, ఆదివారం నాడు భారత నౌకాదళ యుద్ధనౌకలు బహుళ యాంటీ-షిప్ మిస్సైల్ ఫైరింగ్‌లను విజయవంతంగా నిర్వహించినట్లు నేవీ స్వయంగా ప్రకటించింది. “సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని, నౌకల సంసిద్ధతను పునరుద్ఘాటించేందుకు భారత నౌకాదళ నౌకలు బహుళ యాంటీ-షిప్ ఫైరింగ్‌లను విజయవంతంగా చేపట్టాయి. దేశ సముద్ర ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా, విశ్వసనీయంగా, భవిష్యత్తుకు తగ్గట్టుగా ఉంది” అని నౌకాదళం తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. కొద్ది రోజుల క్రితం, నేవీకి చెందిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక అరేబియా సముద్రంలో మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఎంఆర్-ఎస్ఏఎమ్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. పాకిస్థాన్ నౌకాదళం అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి పరీక్షలను నిర్వహించడానికి ముందే భారత్ ఈ పరీక్షను చేపట్టడం గమనార్హం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, ఇతర గగనతల లక్ష్యాలను ఛేదించడంలో ఎంఆర్-ఎస్ఏఎమ్ అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment