శీర్షిక: ఓ జర్నలిస్ట్ సోదర ! నీకు వందనం..!

శీర్షిక: ఓ జర్నలిస్ట్ సోదర ! నీకు వందనం..!

నిజాన్ని నిర్భయంగా వ్రాసిఅవినీతి అక్రమార్కుల బండారం బయట పెట్టి…హలకలంతో భూకాగితాన్ని దున్నుతు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఓ జర్నలిస్ట్ సోదర ! నీకు వందనం..!

ప్రమాదం అని తెలిసినా భయపడకుండా సమాజాన్ని దోచుకునే క్యాపిటలిస్టుల బండారాన్ని బయట పెట్టి హలకలంతో భూకాగితాన్ని దున్నుతు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఓ జర్నలిస్ట్ సోదర ! నీకు వందనం..!

అవని లో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యా లను, అకృత్యాలను, ఎండగట్టి, బయటపెట్టి జర్నలిజం విలువను ఉన్నత శిఖరానికి తీసుకొని వచ్చి హలకలంతో భూకాగితాన్ని దున్నుతు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఓ జర్నలిస్ట్ సోదర ! నీకు వందనం..!

ఆకలిదప్పులకు ఓర్చుకొని పగలనకా రాత్రనకా కష్టపడి పత్రికా వ్యవస్థను ఉన్నతస్థాయి లోకి తీసుకోని వచ్చి హలకలంతో భూకాగితాన్ని దున్నుతు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఓ జర్నలిస్ట్ సోదర! నీకు వందనం..!

మానవాళి మనుగడ సాఫీగా సాగడం కోసం ప్రతి ఒక్కరిలో అంతర్గత ఆత్మ శక్తిని మేల్కొలుపుతూ హలకలంతో భూకాగితాన్ని దున్నుతు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న  ఓ జర్నలిస్ట్ సోదర! నీకు వందనం..!

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలతో శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి), మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

Join WhatsApp

Join Now

Leave a Comment