మంచిర్యాల: రాజీవ్ నగర్ మోడల్ పాఠశాలలో షి టీం అవగాహన సదస్సు

మంచిర్యాల: రాజీవ్ నగర్ మోడల్ పాఠశాలలో షి టీం అవగాహన సదస్సు

మంచిర్యాల, మే 15, సమర శంఖం ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా షి టీం సిబ్బంది గురువారం విద్యార్థులకు సమ్మర్ క్యాంపు లో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ క్రమంలో షి టీం సిబ్బంది జ్యోతి, అలాగే శ్రావణ్ హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం గురించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విషయాలపై అవగాహన కల్పించారు. ఇదే క్రమంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎలా ఎదుర్కోవాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించి తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి విపత్కర సమయం ఎదురైనా పోలీసుల అధికారిక నెంబర్ 100 గానీ 1098 కు గానీ కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న, యోగ ఉపాధ్యాయులు సుధాకర్, పీడీ ఉపాధ్యాయులు సుదీప్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment