Butter Fly Effect : మీకు తెలుసా? పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఒక హిందువు అని ?
Butterfly Effect గురించి మీరు వినివుంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో ఎక్కడో జరిగే చిన్న సంఘటన మరొకచోట పెద్ద మార్పులకు దారి తీస్తుంది.
మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకులు హిందువులు. వాళ్లు గుజరాతిలో ఉండేవాళ్లు. జిన్నా తాత చేపల వ్యాపారం చేసేవాడు. అయితే, అది ఒక పక్క ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం ఇలా మాంసం వ్యాపారం చేయడం తప్పు అంటూ కుల పెద్దలు ఆ కుటుంబాన్ని కులం నుండి బహిష్కరించారు.లేదు నేను నా వ్యాపారం వదులుకుంటాను అన్ని జిన్నా వాళ్ళ తాత బ్రతింలడటం జరిగింది కానీ కుల పెద్దలు ఒప్పుకోలేదు
దీంతో కోపానికి వచ్చిన జిన్నా తండ్రి, “నాకు ఈ కులం వద్దు, మతం కూడా వద్దు,” అని ఇస్లాం మతంలోకి మారిపోయాడు.
దాని ఫలితంగా హిందువుగా పుట్టాల్సిన మహమ్మద్ అలీ జిన్నా, ముస్లింగా పుట్టి, ముస్లింగా పెరిగాడు. తర్వాత ముస్లిం లీగ్‌లో చేరి, దాన్ని బలోపేతం చేసి, చివరికి పాకిస్తాన్ కోసం పోరాడి ,ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ ఉద్యమించాడు. ఆఖరికి పాకిస్తాన్ ఏర్పాటైంది.
ఇప్పుడు ఊహించండి :
అప్పట్లో కుల పెద్దలు జిన్నా తాతను తిరిగి కులంలోకి తీసుకుని ఉండి ఉంటే, అతని కుటుంబం హిందువులుగానే ఉండేదే.
అప్పుడు జిన్నా ముస్లింగా కాక, హిందువుగా పుట్టి ఉండేవాడు.
అయితే అతను ముస్లింల కోసం పాకిస్తాన్ కోసం పోరాటం చేసేవాడు కాదేమో.
ఆవిధంగా భారత ఉపఖండ విభజనే జరిగి ఉండకపోవచ్చు.
దీని వల్ల లక్షలాది మంది చనిపోయే\PARTITION\(విభజన) వల్ల ప్రాణ నష్టాలు, కాశ్మీర్ సమస్య ఇవన్నీ ఉండేవి కావు.
అంటే ఓ చిన్న సంఘటన – జిన్నా తాత చేపల వ్యాపారం చేయడం వల్ల ఓ కుటుంబం మతం మారింది. దాంతో భారత్ దేశ చరిత్రే మారిపోయింది.
ఇదే Butterfly Effect:
ఒక చిన్న మార్పు ఎంత పెద్ద పరిణామాలకు దారి తీస్తుందో చెప్పే అద్భుతమైన ఉదాహరణ.