తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్: రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ నీతి నిబంధనకు క్రమశిక్షణకు మారుపేరని ఆయన పేర్కొన్నారు.ఆదివారం ఉదయం తిమ్మాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయము వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతో హెచ్.పీ బంక్ వద్ద వి కన్వర్షన్ హాల్ కి తరలివచ్చారు.తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ అధ్యక్షతన మహానాడు పండుగ వాతావరణం లో నిర్వహించారు. మనీ మహానాడు సభలో ఎమ్మెల్యే మద్దిపాటి ప్రసంగిస్తూ మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత హార్దిక పరిపుష్టి సాధించే దిశగా ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు,మండల పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ,మండల పార్టీ నాయకులు పోలిన శ్రీను,మాజీ ఎంపీపీ మాజీ జెడ్పిటిసి ఏపూరి దాలయ్య,మాజీ జడ్పిటిసి దేవరపల్లి వీరస్వామి చౌదరి, పాకలపాటి గాంధీ, జడ్పిటిసి శ్యామ్యులు, ఏఎంసి వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు,దేవరపల్లి హేమంత్,నాదెళ్ల సురేందర్, ఇమ్మడి రత్నాజీ,మట్టపర్తి రూపేష్ కుమార్, బోట్ల సాయి,ఏపూరి కిషోర్,ఘంట శ్రీను,ఆచంట సత్యనారాయణ,నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి
Published On: May 20, 2025 8:46 pm
