మంథని: సూరయ్యపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

మంథని: సూరయ్యపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

మంథని, జూన్ 16, సమర శంఖం ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైతు వేదికలో సోమవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానము ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతు భరోసా విడుదల కార్యక్రమం జరిగింది.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియం నుండి ప్రత్యక్ష ప్రసారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ప్రారంభోత్సవం చేశారు. రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే రైతు వేదికల నుండి రాష్ట్రంలోని పలువురు రైతులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, SAC (TGERC) సభ్యులు శశిభూషణ్ కాచే, మాజీ జెడ్పిటిసి సభ్యులు మూల సరోజన, మాజీ మార్కెట్ చైర్మన్ అజీమ్ ఖాన్, మంథని ఆర్డిఓ సురేష్, మంథని డివిజన్ ఏడిఏ అంజనీ, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రత్యూష, సాగర్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment