తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జనాభా ఉన్న గొల్ల,కురుమలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించాలని అఖిలభారత యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు.గత ప్రభుత్వం గొల్ల,కురుమలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందని,కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరికి కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. కేవలం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విఫ్ ఇచ్చి సరిపెట్టుకుందని విమర్శించారు.తక్కువ శాతం ఉన్న ఒకటి, రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టిందని,కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గానికి చెందిన ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.
గొల్ల,కురుమలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించాలి… గుండెబోయిన అయోధ్య యాదవ్
Published On: December 6, 2024 7:04 pm
