చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామానికి చెందిన సామిడి బుచ్చిరెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం లబ్ధిదారుని కుటుంబానికి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్, గ్రామ శాఖ కోశాధికారి బద్రి పోచయ్య, ఊదరి లింగయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు దాసరి గణేష్, యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు డాకోజీ సతీష్, జంగం శేఖర్, ఐతరాజు శ్రీకాంత్, దాసరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మాజీగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
Published On: December 7, 2024 12:30 pm
