రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్కమి షనర్ సుధీర్ బాబు తెలిపారు. నల్లగొండలో శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్య టనను పురస్కరించుకొని బందోబస్తును సమీక్షించడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ ఏసిపి కార్యాలయానికి రాచకొండ సి పి సుధీర్ బాబు • వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం ఎన్ హెచ్ ఏ, విద్యుత్, ఆర్టిఏ, ట్రాఫిక్, పోలీస్ తదితర అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో భువనగిరి డిసిపి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ తదితర అంశాలపై కమిషనర్ సమీక్షనిర్వహించారు, సైబర్ నేరాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ తదితర విషయాలపై ముచ్చటిం చారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడం ” జరుగుతుందని, జోనల్ కు అదనంగా మరో రెండు వందల మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, చౌటుప్పల్ లాంటి ప్రధాన నగరాలలో ఉన్న సిబ్బందికితోడుగా అదనంగా మరోవన్ ప్లస్ ఫోర్ సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు.
సైబర్ నేరాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై వాహనదారులు, యువకులు, విద్యార్థులు, ప్రజలలో అవగాహన కల్పించడం కోసం తమ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను త్వరలో ఏర్పాటు చేస్తామని సిపి తెలిపారు. తమ పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో గ్రామాలలో ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, మద్యం సేవించి అడ్డగోలుగా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగి తమ విలువైన ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆ కుటుంబాలు కూడా పెద్దదిక్కును కోల్పోయి అనాధలుగా మారుతున్నాయన్నారు. యువకులు సరైన అవగాహన లేకపోవడం వల్లసైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారని, డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలవుతున్నారని, కొందరు అప్పుల బాధలు భరించలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాలనివారణ కోసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లైసెన్స్ లేని మైనర్ లు అయిన తమ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తొందరపడి జంప్ చేయవద్దని, అలా చేయడం వల్ల ప్రమాదాన్ని మనమే కొనితెచ్చుకున్నట్లు అవుతుందని, వాహనాలను నడిపేటప్పుడు, సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిషనర్ సుధీర్ బాబు వెంట యాదాద్రి భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు.