తెలంగాణ దశను మార్చిన రోజు డిసెంబర్ 9 కెసిఆర్ దీక్ష ఫలించిన రోజు డిసెంబర్ 9 – మాజీ ఎంపీ నామ..                                                                          

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆరున్నర దశాబద్దలుగా అనేక దశల్లో జరిగిన పోరాటంలో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధకుడు కెసిఆర్ దీక్షఫలించిన రోజు డిసెంబర్,9 అని బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి.. స్వరాష్ట్ర స్వప్నం సాకారం కోసం “తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో” అంటూ నినాదంతో మలి దశ ఉద్యమాన్ని కెసిఆర్ పతాక స్థాయిగా తీసుకువెళ్లిన్నారని నామ తెలిపారు. నాడు 15 వ లోక్ సభ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గా వున్నా తాను పార్లమెంట్ లో జరిగిన బిఎసి మీటింగ్ లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని మాట్లాడటం జరిగిందన్నారు. దీక్ష పూనిన కెసిఆర్ నిమ్స్ హాస్పిటల్ లో చావు బతుకుల్లో వున్నారని బిఎసి మీటింగ్ లో ప్రస్తావించడంతో పాటు పార్లమెంట్ లో మాట్లాడటం జరిగిందన్నారు. ఆ సమయంలో బీజేపీ తరుపున స్వర్గీయ సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ పార్టీ తరుపున పొన్నం ప్రభాకర్, టీడీపీ నుండి రమేష్ రాథోడ్ కూడా నాడు ఎంపీలు గా ఉన్నారన్నారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం తో పాటు తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం గురించి పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని నామ పార్లమెంట్ ను స్థంభింపజేసమన్నారు. అంతే కాకుండా నాడు స్పీకర్ ఫార్మాట్ లో తాను, కెసిఆర్ కూడా రాజీనామా పత్రం అందజేసిన విషయాన్ని ఈ సందర్బంగా నామ గుర్తు చేసారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు నాడు తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, ఉద్యోగులు, అమరులు నిరంతరం తమ వాణి వినిపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉపందుకోవడంతో పాటు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజలను కదిలించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు. తెలంగాణ బిల్లు లోక్ సభ లో ప్రవేశ పెట్టినప్పుడు తాను స్వరాష్ట్ర సాధన కొరకు తెలంగాణ రైతు బిడ్డగా తొలి ఓటు వేయడం జరిగిందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ పోరాడడం జరిగిందన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండని, ఆనాటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం నేటి తెలంగాణ సమాజం మరువరాదన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment