దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని,అంబానీ లతో చేస్తున్న స్నేహం వికృత రూపం దాలుస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎస్ఎమ్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ప్రతినిధుల సభకు హాజరైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కష్టార్జితంతో పోగేసిన సంపదను ఆదాని,అంబానీలకు దోచిపెట్టడం సరికాదన్నారు.సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం విదేశాల్లో సేకరించిన70,80 వేలకోట్ల సంపదను లంచాల రూపకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రూ .17 వందల ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం బయట పెట్టిందన్నారు.దీంతో తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడం సంతోషకరమైన అన్నారు.దావోస్ నగరంలో నిర్వహించిన జాయింట్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాని,అంబానీలతో కుదుర్చుకున్న రూ.12400 ల కోట్ల సంగతి ఏంటో ప్రజల ముందు బహిర్గతం చేయాలన్నారు.జెమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం దీన్ని సీపీఐ(ఎం) పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టనుందన్నారు.జమలి ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీయడమే కాకుండా రాష్ట్రాల స్వయం శక్తిని బలహీనపరుస్తుందన్నారు.ఎన్నికల ఖర్చులు తగ్గకపోను మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.జమిలి ఎన్నికలు దేశ సంక్షేమానికి మంచివి కావన్నారు.ఒక రాష్ట్రంలో అవిశ్వాసంతో ప్రభుత్వం కూలిపోతే తిరిగి ఎన్నికలు నిర్వహించరా? అన్నారు.6 గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు చేయడం లో అర్థం లేదన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుతున్న ప్రజాసామ్య పరిరక్షణ ఏడవ గ్యారంటీ అమలు చేయడం లేదన్నారు.హైడ్రా పేరుతో పేదల ఇండ్లకు కూల్చడం,రామగుండం అడవులు నరకడం, ప్రాజెక్టుల పేదల భూములు గుంజుకోవడం, గ్రూపు వన్ విద్యార్థుల అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామ్యకం కాదా అని ప్రశ్నించారు.గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు.ముఖ్యమంత్రిలు ఎక్కడికి పోతే అక్కడ సిపిఐ(ఎం) నాయకులన అరెస్టు చేయడంలో
ఇద్దరూ ఒకటే అన్నారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి పాలించాలని కోరారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే సిపిఐ(ఎం) చూస్తూ ఊరుకోదన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య,జూలకంటి రంగారెడ్డి,పోతినేని సుదర్శన్, బొంతల చంద్రారెడ్డి,జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ,బట్టుపల్లి అనురాధ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగా నర్సింహులు,మాటూరు బాలరాజు,కల్లూరి మల్లేశం,దోనూరి నర్సిరెడ్డి,దాసరి పాండు,మేక అశోక్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, మండల కార్యదర్శి గంగాదేవీ సైదులు, కార్యదర్శి గోషిక కరుణాకర్,జిల్లా DYFI అధ్యక్ష కార్యదర్శులు పల్లె మధుకృష్ణ,గడ్డం వెంకటేష్ మండల నాయకులు రాగిరు కిష్టయ్య, తడక మోహన్,చింతల సుదర్శన్,పల్లె శివకుమార్,బోదాస్ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు