మాస పౌర్ణమిని పురస్కరించుకొని…గృహ సీమలో ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి వేడుకలు..

చౌటుప్పల్ డిసెంబర్ 16 సమర శంఖమ్ 

 

గత 88 నెలల నుండి ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి కార్యక్రమాన్ని పౌర్ణమి రోజున శ్రీ భావన ఋషి కళానికేతన్ చౌటుప్పల వారు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి వలిగొండ రోడ్డులోని కళ్లెం పెంటారెడ్డి కాలనీ లో ఆ కాలనీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,- రజిత దంపతుల నివాసంలో భక్తి కీర్తన గాన నీరాజనం నిర్వహించడం జరిగింది. అనంతరం భారతీయ సంస్కృతి సంప్రదాయాల ధర్మనిరతిని సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ భవనా ఋషి కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు బడుగు శ్రీరాములు మాట్లాడుతూ వెలుగుతున్నప్పుడు హారతిగా మలుగుతున్నప్పుడు సురభిలంగా పరిమళాలను పరివ్యాప్తం చేసే దిశగా మనిషి ధార్మిక సంపత్తిని పెంపొందించుకోవాలని కోరారు. ధన సంపత్తి కన్నా దైవసంపత్తి మిన్న గా భావించాలి. పౌర్ణమి హిందూ సమాజంలో ఒక ప్రత్యేకమైన పర్వదినం అని అదేవిధంగా పౌర్ణమి రోజున చంద్రుని నుండి అమృత కిరణాలు ప్రసరించునని ఈ రోజున మనం సంకల్పించుకున్న సంకల్పాలు వేల రెట్ల ఫలితాలను ఇచ్చును అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు బడుగు శ్రీరాములు, గౌరవాధ్యక్షులు గోశిక బిక్షపతి,ఉపాధ్యక్షులు శ్రీమతి బడుగు సావిత్రి, బడుగు బాలరాజు, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజు, ఆర్థిక కార్యదర్శి గంజి మార్కండేయ, సభ్యులు బొప్పాయి సింహాచలం పోలోజు వెంకటాచారి,కాసోజు గిరిధరాచారి, కోనము వినోద,గోశిక బాలరాజు, బడుగు జయప్రకాష్, దార హరికుమార్, పోలోజు కృష్ణ చారి గోశిక స్వామి తదితరులు ఎల్లరు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment