మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలో ఉన్న గురుకులంలో విద్యార్థులకు ఎలుకలు కరిసి హాస్పిటల్ కి వెళ్ళిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఖండిస్తున్న సుదర్శన్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలుకలు కరిచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పలకరించడానికి వస్తే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు లేక బాత్రూమ్స్ సౌకర్యం లేక హాస్టల్లోకి పాములు ఎలుకలు వస్తున్నాయని తెలిపారు. వాటి వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సంబంధించిన అధికారులు పట్టించుకోవడంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వలనే జరుగుతుందని ఆరోపించారు. ఇలాంటి పరిపాలన సరికాదని అన్నారు. దీనిపై వెంటనే చర్య తీసుకుని సరైన వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. వారితో పాటు మాజీ ఎంపిటిసి వెంకట్ రెడ్డి నాయకులు నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment