నిరంకుశ పాలనను నిరసిస్తూ.. అన్నదాతలకు మద్దతు డాక్టర్  బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ. మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఉప్పల్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలో  మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలు అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పైన కొడంగల్ లోని లగచర్ల రైతులు తమ భూమిని తామే సాగు చేసుకుంటామంటే, వారిపై అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేసి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ జైల్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సేకరించిన 14 వేల ఎకరాల భూమిని తిరిగి ఇస్తామని ముచ్చెర్ల ఫార్మా నగరంలోని రైతులకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్ష హోదాలో ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు. అయితే తన మాటను హాయిగా మరచిపోయి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ చిలుకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, కార్పొరేటర్లు శాంతి సాయి జెన్ శేఖర్, జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, యువజన విభాగం నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment