ఏపీజీవీబీ పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు గా మార్పు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు …బ్యాంకు మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి..

కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆదేశానుసారం ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో బ్యాంకింగ్ సేవలు అందించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇక నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకు గా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుందని చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ కె హర్షవర్ధన రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బ్రాంచీలు ఉన్న బ్యాంక్ గా మారనుందని, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంక్ లను అనుసంధానం చేసి ప్రతి రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంక్ ఉండేలా చర్యలు తీసుకుందని మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో బాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలు కలిపి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పు చేసే సమయంలో మన బ్యాంక్ సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు పూర్తిగా ఆగిపోనున్నాయని, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపిఐ అనగా ఫోన్ పే, గూగుల్ పే ఇంకా కొన్ని సేవలు పూర్తిగా పనిచేయవని మేనేజర్ తెలిపారు. కావున మన బ్యాంక్ ఖాతాదారులు ముందుగా గమనించి ఈనెల 27 లోపు అత్యవసరమైన బ్యాంకింగ్ కార్య కలాపాలను నిర్వహించుకోవాలని మేనేజర్ తెలిపారు. బ్యాంకు సేవలు తిరిగి 1వ తేదీ జనవరి 2025 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా అన్ని రకాల సేవలు యధావిధిగా ఖాతాదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ మార్పు సమయంలో కలిగే అసౌకర్యానికి చింతిస్తూ రేపటి మెరుగైన సేవల కోసం జరిగే ఈ మార్పుకి సహకరించ వలసిందిగా మేనేజర్ హర్షవర్ధన రెడ్డి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment