విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు
ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు..
కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విద్యార్థినులు దవాఖాన పాలుకావడం దారుణం అని, కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్కకాట్లు, పాముకాట్లు కరెంట్ షాక్ లతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోని దుస్ధితిలో ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల గురుకులబాట కార్యక్రమం డొల్లతనం 24 గంటలు గడవక ముందే బయటపడిందని విమర్శించారు. ప్రచారం పేరిట ఒక్క రోజు తమషా చేయడం మానుకుని, గురుకులాల్లో విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు….?