జమిలి ఎన్నికల బిల్లుపై జరుగుతున్న చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకం..భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17 సమర శంఖమ్ 

75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూపొందించి నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏదైనా ఒక బిల్లును టేబుల్ పై పెట్టేముందు రాజ్యాంగం ప్రకారం రూపొందించి పెట్టవలసిన అవసరం ఉంటుందని , రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ జమిలి ఎన్నికల బిల్లు రూపొందించారు..కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మాటల్లో స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లోని మైనార్టీలకు మద్దతు తెలిపాలని , పార్లమెంట్లో బ్యాగులతో వినూత్న ప్రదర్శన చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..

అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశం ప్రపంచంలో పాలస్తీనా ఇక ఇతర ఏ దేశాల్లో కూడా సామాన్యులకు మైనార్టీలకు జరిగే అన్యాలపై మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మన భారత దేశం అనేది సెక్యులరిజం కాబట్టి ,బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అవమానాలు , దాడులకు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.పార్లమెంట్ సజావుగా నడవాలని , ప్రజా సమస్యలపై పోరాడాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment