గంటల్లో జైలు…బెయిలు!..చట్టానికి దగ్గర చుట్టాలు డబ్బున్నోళ్ళు..ఇవన్నీ పేదోళ్ళకు మినహాయింపు..చట్టమా..? నీకు శతకోటి దండాలు…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17  సమర శంఖమ్ :-

బెయిల్ కు అర్హత ఉండి కూడా , విడిపించే వారు లేక లక్షలాది మంది జైళ్ళలో ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. చట్టమా..? నీకు శతకోటి దండాలు. ధనం , పరపతి , హోదా , కులం , మతం , ప్రాంతం , ఉన్నత స్థానం , అధికారం..ఇవన్నీ చట్టానికి దగ్గర చుట్టాలు. ఇవేవీ లేనివాళ్ళు మట్టిలో కొట్టుకుపోవలసిందే. దేశంలోని కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. అయినా స‌రే , అల్లు అర్జున్ విష‌యంలో కోర్టులు వేగవంతంగా/య‌మ స్పీడుగా ప‌ని చేశాయి. ఒక కోర్టు 15 రోజుల రిమాండ్ వేస్తే , ఆ వెంట‌నే మ‌రో కోర్టు బెయిల్ ఇచ్చేసింది. కోర్టే కాదు , పోలీసు వ్య‌వ‌స్థ కూడా వేగవంతంగా/జెట్ స్పీడులో ప‌ని చేసింది. అల్లు అర్జున్ కోసం వంద‌లాది పోలీసులు , వంద‌లాది ప్ర‌భుత్వ సిబ్బంది , రాష్ట్రంలోనే రెండు పెద్ద కోర్టులు ఈరోజు మొత్తం పని చేశాయి. అల్లు అర్జున్ కి ఇచ్చిన ఈ సమయంలో స‌గం సమయం ఇచ్చినా దేశంలోని కోర్టుల్లో అన్ని కోట్ల కేసులు పెండింగులో ఉండేవి కావు. అందుకే..ఒక మహిళ మరణించింది ఆమె కుమారుడు చావుబతుకుల్లో ఉన్నాడు. అందుకే డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బులేనోడికి ఒక న్యాయమా.. డబ్బుకు లోకం దాసోహం.

Join WhatsApp

Join Now

Leave a Comment