ఉదయం 9:40 నుంచి 4:30 వరకు పాఠశాలలు నిర్వహించాలి
యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 18 సమర శంఖమ్ :-
తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉదయం పనుల కోసం బయటికి వెళ్లే ఉద్యోగులు , పాఠశాలకు వెళ్లే విద్యార్థులు గజగజ వణికి పోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులను బడికి పంపించాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందిపడుతున్నారు. చలిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పని సమయాలు మార్చాలని జిల్లాలోని తల్లిదండ్రులు , ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో , కొన్ని ప్రాంతాల్లో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆదిలాబాద్ తోపాటు మరికొన్ని జిల్లాలో చలి మరింత భయానక స్థాయికి చేరింది. జిల్లాలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో మైనస్‌లోకి వెళ్లిపోయాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా , స్కూల్ సమయాలు మార్చేందుకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలు డిసెంబర్ 19 నుంచి అంటే రేపటి నుంచి ఉదయం 9.40 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే నడపాలని నిర్ణయించారు. విద్యార్థులు చలి నుండి రక్షణ పొందేందుకు సరైన బట్టలు ధరించడం , ఉదయం బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అని చెప్పడంలో తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఇలాంటి చర్యలు ఇతర జిల్లాల్లో కూడా అమలులోకి వస్తే , విద్యార్థులు మరింత సురక్షితంగా ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు.