గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల జాప్యం వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
– తెలంగాణ రాష్ట్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా అనునిత్యం సమస్యల సుడిగుండమైందని,తానే స్వయంగా గత వారం రోజులుగా వేరు వేరుగా నిరసన తెలుపుతున్న బాధిత పక్షాల తరఫున పోరాటం చేస్తున్నాను…
– నాణ్యమైన మానవ వనరులను తయారు కావడానికి విద్యపై చేసే ఖర్చు ముఖ్యం..కానీ తమకు కమిషన్లను తెచ్చి పెట్టవనే దుర్బుద్ధితో గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఆపివేశారు..
– సుమారు పదివేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కళాశాలలో యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది…
– రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘట్కేసర్ శ్రీనిధి యాజమాన్యం విద్యార్థులను ఫీజులు సొంతంగా చెల్లించాలని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా జలగల్లా పీల్చిపిప్పి చేస్తుంది..
– కళాశాలల తీర్బకాయల కోసం తమ పార్టీ అనేకసార్లు గళం విప్పింది కానీ, ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల అయ్యేలా పోరాటం కొనసాగిస్తాం..
– కాని డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్న శ్రీనిధి యాజమాన్యం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము..
– ఇప్పటికైనా శ్రీనిధి యాజమాన్యం కళ్ళు తెరిచి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి..