షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 20 సమర శంఖమ్
నందిగామ మండలలోని రంగాపూర్ గ్రామాల్లో పట్టపగలే దొంగలు శుక్రవారం ఓ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన సమాచారం మేరకు జాకారం సురేష్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. దుండగులు ఆ ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అందులోని 35 తులాల వెండి పట్ట గొలుసులు , 18000 నగదు అపహరించుకుని వెళ్లారు. సాయంత్రం సమయానికి ఇంటికి వచ్చిన చూసిన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు అనుమానించాడు. ఇంటి లోనికి వెళ్లి బీరువా చూడగా పట్ట గొలుసులు, నగదు కనిపించకపోవడంతో నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.