బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది.
నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని
కుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పి
డివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని కారుపై
పడింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు చిన్నారులతో
సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు.
వాహనం నుజ్జునుజ్జు కాగా, అందులో ఇరుక్కుపోయిన
మృతదేహాలను స్థానికుల సహకారంతో పోలీసులు
బయటకు తీశారు.