*టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్.
ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జికె కాలనీలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో గంజాయి,డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ విచ్చేసి గంజాయి,డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అల వాటుపడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు.డ్రగ్స్‌కు అలవాటు పడితే మనస్సు మన ఆధీనంలో ఉండదన్నారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇప్పించలన్నారు.
గంజాయిని అమ్మేవారిపై నిఘా పెట్టి పోలీస్లకు పట్టించలన్నారు.విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదవి ఉన్నత శిఖరాలు చేరికోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు రామ రావు, కీసర మండల్ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ యాదగిర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోమేశ్, తదితరులు పాల్గొన్నారు