ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 24 (సమర శంఖమ్ )
ఆత్మకూరు ఎం పోలీస్ స్టేషన్‌ను డీసీపీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు.వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన పోలీస్ కానిస్టేబుల్‌లతో సమావేశమై వారి నైపుణ్యాలను మెరుగుపరచేందుకు విలువైన మార్గదర్శకాలు మరియు సూచనలు ఇచ్చారు.అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు.ఇది పర్యావరణ చైతన్యం మరియు సమాజ భాగస్వామ్యానికి ప్రాధాన్యతను సూచిస్తుంది అని అన్నారు మండల కేంద్రంలో ఉన్న చర్చిను సందర్శించి క్రిస్మస్ వేడుకలు ప్రశాంతంగా మరియు ఆనందకరంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో ఎసై కృష్ణయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.