బాబు ఇంకా మమ్మల్ని గుర్తుపట్టడం లేదు..కేసు వెనక్కి తీసుకుంటాను… శ్రీతేజ్ తండ్రి భాస్కర్..

---Advertisement---

సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్​ తండ్రి భాస్కర్‌, తొక్కిసలాటపై పెట్టిన కేసు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు ఇవాళ ఆయన కిమ్స్​ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్‌ ప్రతిరోజు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శ్రీతేజ్‌ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడని అన్నారు. అయితే ఇంకా తమను గుర్తించట్లేదని వెల్లడించారు. పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్​ వారు రూ.50 లక్షలు, ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిచారని అన్నారు. పుష్ప-2 నటుడు అల్లు అర్జున్ రూ.10 లక్షలు ట్రీట్​మెంట్​ కొరకు అందించినట్లు భాస్కర్ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ, అల్లు అర్జున్ నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అవసరమైతే నటుడు అల్లు అర్జున్​పై పెట్టిన కేసు వెనక్కి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు శ్రీతేజ్​ తండ్రి భాస్కర్​ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కిమ్స్​ ఆసుపత్రి వైద్యులు బాలుడు శ్రీతేజ్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment