తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని కలిసిన భువనగిరి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల

భువనగిరి డిసెంబర్ 25 సమర శంఖమ్ న్యూస్:-

భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలను గుర్తుచేసారు. భువనగిరి జిల్లా రాజకీయాలపై కాసేపు చర్చించి.ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశత్వ విధానాలపట్ల ప్రజలకు మరియు రైతులకు అండగా ఉండాలని అవసరమైతే పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉండాలని కెసిఆర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment