ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాల వేడుకలు
జెండా ఆవిష్కరించిన సిపిఐ గ్రామ కార్యదర్శి మహ్మద్ నయీమ్
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 26 సమర శంఖమ్ :-
భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్బంగా రాఘవాపురం గ్రామం లో సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి మహ్మద్ నయీమ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1925 నుండి ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించి అనేక హక్కులను సాధిస్తూ ప్రజా పోరాటాల పార్టీగా నేటికి 99 వసంతాలు పూర్తి చేసుకుని 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.సిపిఐ పార్టీ నాటి దేశ స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు కీలక పాత్ర పోషించి భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఒక్కటే అని అన్నారు. సిపిఐ పార్టీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల రాస్తా రోకోలు,ధర్నాలు, నిర్వహిస్తూ అనునిత్యం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాలలో డిసెంబర్ 30న నిర్వహించే బహిరంగ సభకు నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధగాని పృథ్వీరాజ్, మారుపాక మచ్చగిరి, కాటం నరేష్,యండి షబ్బీర్, రహీం , మూషం చంద్రమౌళి,బాకి శ్రీధర్ , మారుపాక అంజయ్య , యానాల సత్తిరెడ్డి, ఎర్కల యాదగిరి, తుమ్మలగూడెం భరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.