అన్యాయంగా అధికారులు కక్ష సాధింపు బడ్డీ షాప్ కూల్చివేత”

నిరుపేదడైన పొట్టకూటి కొట్టిన ప్రజా ప్రతినిధులు అధికారులు….. 

గ్రామంలో ఎన్నిసార్లు ఉన్న కక్ష సాధింపు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గ్రామంలో నివాసముంటున్న షేక్ : ఇస్మాయిల్. పరవాడ సభస్టేషన్ పరిధిలో బి.సి.కాలనీలో సమీపము రోడ్లో 13 సంవత్సరాలుగా నా జీవన ఉపాధి మేరకు చిన్న మటన్ షాపు పెట్టుకున్నాను నా ఫ్యామిలీనీ పోషించుకోవడానికి చిన్న మాంసం కొట్టు బడ్డి పెట్టుకున్నాను . దీని మీద గ్రామ సర్పంచ్ సిరిపప్పు అప్పలనాయుడు.. ఎమ్మార్వో. అంబేద్కర్ . పరవాడ పోలీస్ స్టేషన్ అధికారి సీ.ఐ మల్లికార్జున .మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్న ఆర్.ఆర్ రాజులునాయుడు నెలవారీగా మాంసం ఇవ్వాలంట ఇవ్వలేనందుకు నామీద కక్ష కట్టి నా యొక్క షాపును తీసేయమని బెదిరించారు అయితే నేను పరవాడ గ్రామంలో ఎన్నో ఆర్ అండ్ బి రోడ్ లో . మరియు గ్రామకంఠంలో ఎన్నో. పర్మిషన్ లేని షాపులు ఉన్నాయి. అని చెప్పినా సరే . నా షాపుకు పర్మిషన్ ఉందని.గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చారని కూడా చెప్పిన సరే వినలేదు. కక్ష పూర్వకంగా దోషం చేశారు. వెంటనే పరవాడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు . పరవాడ సీ.ఐ మల్లికార్జున.మా మీద కంప్లైంట్ ఇస్తావా అని పరవాడ సీ.ఐ . మల్లికార్జున రేసుగా.మాట్లాడారు. ఆ తర్వాత .విఆర్ఓ. గంధవరపు సత్యనారాయణ. చేత నాపై కేసులు పెట్టించారు.అయితే నేను వెంటనే పరవాడ ఎమ్మార్వో అంబేద్కర్ గారిని కన్నీరుతో ఎమ్మార్వో ఏంటి దౌర్జన్యమని వారిని అడిగాను నేను చెప్పిన మాట వినలేదు అందుకే ఈ పని చేశాను సరే ఇప్పుడు నాకు 50,000 ఇవ్వు నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పారు సార్ నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని నేను ఇవ్వలేను అని చెప్పిన సరే వినలేదు నువ్వు ఎలా ఆ ప్లేస్ లో అమ్ముతావో చూస్తాను. అదేంటి సార్ ఎన్నో షాపులు ఉన్నాయి రోడ్లమీద నా ఒక్కటి ఎందుకు కక్షపూరకంగా ఇరగకొట్టారు మళ్లీ అమ్మోద్దంటున్నారు. రెండు లక్షల నష్టపరియం అయిపోయింది సార్ అని చెప్పిన సరే నా మాట ఒక లెక్క చేయకుండా నన్ను నువ్వు ప్రశ్నిస్తావని రోడ్డు మీద కొట్టారు నేను పరవాడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నా యొక్క కంప్లైంట్ ఇప్పటివరకు ఎంక్వయిరీ చేయలేదు వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కూడా నమోదు చేయలేదు వారిచ్చిన కంప్లైంట్ మేరకు నన్ను . పరవాడ పోలీస్ స్టేషన్ వాళ్ళ స్టేషన్కు పిలిపించి బెదిరించారు నీ మీద విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు చూడు సార్ నేను ఇచ్చిన కంప్లైంట్ ఏం చేశానని అడిగాను అది ఎంక్వయిరీ జరుగుతుంది నాకు సంబంధం లేదని చెప్పారు సీ.ఐ మల్లికార్జున . ఎస్సై కృష్ణారావు.నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయంట నీ మీద అనేక పలువురు కేసులు పెట్టి అలాగే గంజాయి కేసు కూడా పెట్టి నిన్ను ఇరికిస్తాను అని బెదిరించారు 25/11/2024. తెల్లవారు నాలుగు గంటల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మా ఇంటి తలుపు కొట్టారు ఎవరని బయటికి వెళ్లి చూస్తే మాకు మటన్ కావాలి ఫంక్షన్ ఉంది కేజీ ఎంతకిస్తావు అని బేరాలు ఆడి అడిగారు నేను కేజీ 900 కి అమ్ముతున్నాను ఫైనల్ గా 750 కి ఇస్తాను అంతకంటే తగ్గించలేను అని చెప్పాను అయితే ఒకసారి బయటికి తలుపు తీయమ్మ పనుంది అని చెప్పారు సరే అని తలుపు తీశాను వెంటనే మెడ మీద చేయి వేసి నా కాలర్ పట్టుకున్నారు. ఎవరండీ మీరు అడిగాను ఒకరు నాకు తెలుసు ఆయన పేరు: (వల్లి) ఆఫ్ ఫాంట్ తో ఉన్నాడు కానిస్టేబుల్ వల్లిని ఎవరు వీరంతా అని గట్టిగా అడిగాను మా ఇంటికొచ్చిన సమీపంలో ఎవరూ కూడా యూనిఫాంలో లేరు తర్వాత ప్రశ్నిస్తే మేము పోలీసులు మీ చెప్పారు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అరెస్టు వారు అంటే ఏది అని అడిగాను .ఏ విషయం కూడా నాకు చెప్పలేదు. నా ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది ప్యాంటు వేసుకొని వస్తానని కూడా చెప్పిన వినలేదు. నిజంగా మీరు పోలీసుల పోలీసులు అయితే యూనిఫాం ఎందుకు వేసుకోలేదు అని అడిగాను ఈ టైంలో ఎందుకు వచ్చారు అరెస్ట్ వారెంట్ ఏది ఏ విధంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మీ ఐడెంటి కార్డులు చూపించండి . అని అడిగాను. అయినా సరే సమాధానం చెప్పకుండా .వెంటనే జీపులోకి తోసేశారు ఆ సమయంలో మా అక్క షేక్ :మేరాబి బయటికి వచ్చి ఎవరండీ మీరు అని అడిగింది నీకు సంబంధం లేదని మా అక్కని తోసేశారు మా అక్క నైటీ చిరిగిపోయింది. నన్ను స్టేషన్ కి తీసుకెళ్లి. నువ్వు సి.ఐ మల్లికార్జున గురించి ఎమ్మార్వో గురించి వార్తలు రాస్తున్నావు అలాగే అసభ్యంగా మాట్లాడుతున్నావ్. నీ ఫోన్ లాక్ తీయు. అని ఎస్ఐ. కృష్ణారావు. నన్ను బెదిరించారు నేను చెప్పినట్టు చేయకపోతే మీ అమ్మ మీ అక్కని నిన్ను కూడా జైలుకు పంపిస్తాం. అని బెదిరించారు నీ పైన తప్పుడు కేసులు పెట్టి. నిన్ను రికిస్తా అంతేకాకుండా గంజాయి కేసులో కూడా నువ్వు బయటికి రాకుండా చేస్తానని ఎస్సై కృష్ణారావు గారు బెదిరించారు అలాగే నా చేతికి అర తులం ఉంగరం కూడా లాగేసుకున్నారు. అయితే నేను భయపడి వాళ్ళు చెప్పినట్టు చేశాను.నా యొక్క ఫోన్లో ఎమ్మార్వో గారి మీద సి.ఐ గారి మీద అసభ్య మాటలు వీళ్లే రాసి పత్తి గ్రూపుల్లో పెట్టారు. ఎస్సై కృష్ణ రావు గారు సారీ ఏంటి సార్ అని కూడా అడిగాను.తర్వాత ఆధార్ కార్డు కూడా అడిగారు నేను ఇవ్వలేదు. మరి ఎలా తీసుకొచ్చారో తెలియదు నాకు. వెంటనే మా ఇంట్లో వాళ్ళు తెలియపరచకుండా. అనకాపల్లి కోర్టుకు తీసుకొని వెళ్లి అక్కడ నుంచి అనకాపల్లి సబ్ జైలుకి పంపించారు 14 రోజులు రిమాండ్ చేయించారు.తర్వాత రెండో కేసు కింద మళ్లీ 14 రోజులు జైల్లో ఉంచారు నాకు బేల్ రాకుండా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆపేశారు ఏదోలాగా బయటకు వచ్చాను. సార్.నాకు న్యాయం జరిపిస్తారని మళ్లీ కన్నీరుతో కోరుకుంటున్నాను. వీరిపై తగు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను.

Join WhatsApp

Join Now

Leave a Comment