కరీంనగర్ జిల్లా : డిసెంబర్ 28 సమర శంఖమ్ :-
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం డిప్యూటీ తహాసిల్దార్ మల్లేశం, ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వెన్షన్ కోసం 6,000 రూపాయలు లంచం తీసుకుంటున్నప్పుడు ఏసీబీ అధికారుల దర్యాప్తులో పట్టుబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ తహాసిల్దార్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్నపుడు రంగంలోకి దిగి అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు కర్యాచరణలో రైతుల నుండి లంచాలు వసూలు చేయడం పై చర్యలు తీసుకుంటూ ఈ ఘటనపై నిఘా ఉంచారు.