డిజిపి కార్యాలయం..మంగళగిరి..
ఫేక్ న్యూస్ ను ఎవరు నమ్మవద్దు షేర్ చేయవద్దు..రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారక తిరుమల రావు పేరిట హోం గార్డ్స్ – సివిల్ పోలీసు అలాగే CT (Band- Bugler) ల రిక్రూట్ మెంట్ కు సంభందించిన ఉత్తర్వుల పేరిట ఒక నకిలీ లేఖను కొందరు వ్యక్తులు సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ద్వారక తిరుమల రావు స్పందిస్తూ, నా పేరు మీద చలామణి అవుతున్న ఈ తప్పుడు ఉత్తర్వుల లేఖను కొందరు వ్యక్తులు తప్పుడు ఉద్ధేశ్యంతో ప్రచారం చేస్తున్నారని. ప్రచారంలో వున్న ఈ లేఖ అలాగే అందులో పేర్కొన్న అంశాలన్నీ తప్పుడు ప్రచారాలు అని వాటికి ఎలాంటి విశ్వసనీయత లేదని కావున రాష్ట్ర ప్రజలెవరూ ఈ తప్పుడు లేఖను నమ్మవద్దని పోలీస్ ప్రధాన కార్యాలయం తెలియజేస్తోంది. ఈ లేఖను సృష్టించిన, షేర్ చేసిన వ్యక్తులపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని . అలాగే ఈ తప్పుడు వార్తను ప్రచారం చేసిన, షేర్ చేసిన వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర డిజిపి ఒక ప్రకటనలో తెలిపారు…