సమర శంఖమ్ డిసెంబర్ 30, అమరచింత ప్రతినిధి:
దొంగలు పక్కాగా ప్రణాళికలను రచించి అందిన కాడికి దోచుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్న చితక దొంగతనం చేస్తే ప్రయోజనం ఏమి లేదనుకున్నారేమో,ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ కు శని ఆదివారాలు సెలవు ఉండడంతో..దుండగులు దొంగతనంకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా కిటికీ స్క్రూల్ తీసి,బ్యాంక్ లోకి ప్రవేశించినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు పోలీస్ లకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్స్ జాగిలాలతో వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులో సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బ్యాంక్ లో నగదు,గోల్డ్ ఎంత మొత్తంలో చోరీ అయ్యాయనే విషయాలు బ్యాంక్ అధికారులు ఇంకా వెల్లడించలేదు.