అర్జున్ మొత్తం ఎపిసోడ్ లో మానవతా దృక్పదం లోపించింది. ఘటన జరిగిన తర్వాత రేవతి కుటుంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వక పోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తొక్కిసలాటలో రేవతి మరణించడం తీవ్రంగా కలచి వేసింది. ప్రజల భద్రత గురించి ఆలోచించే చిరంజీవి ఒక్కరే ముసుగు వేసుకుని సినిమాలు చూసేవారు. నేనూ అలానే చేశాను. రేవంత్ ప్రభుత్వం చేసింది కరెక్టే కుండ బద్దలుకొట్టిన పవన్ కళ్యాణ్.
అల్లు అర్జున్ ఎపిసోడ్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దాని పైన మాట్లాడని పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని అన్నారు. అలా చేయక పోతే రేవంత్ రెడ్డి మీద ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని, సీఎం హెూదాలో రేవంత్ రెడ్డి స్పందించారని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ గొప్ప నాయకుడని, కింది స్థాయి నుంచి ఎదిగిన నేతని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకుఆయన ఎంతో మేలు చేశారని అన్నారు. బెనిఫిట్ షోలకు అవకాశాలిచ్చారని, ఆయన సహకారంతోనే సినిమాల కలకైన్లు పెరిగాయన్నారు. సలార్ తో పాటు పుష్ప2 వంటి సినిమాలు భారీగా కలెక్షన్లు కురిపించాయన్నారు. అంతే కాకుండా పుష్ప2 చిత్రానికి సీఎం పూర్తిగా సహకరించారని తెలిపారు.
రేవంత్ కు రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్న నాటి నుంచి తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ నాయకుడే అని అన్నారు. అయితే కొన్ని సార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు.
మంగళగిరిలో సోమవారం మీడియా చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం అందరికీ సమానమే అని, ఇలాంటి సంఘటనల్లో పోలీసులను తప్పపట్టనని చెప్పారు. అల్లు అర్జున్, ఆయన టీమ్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని అన్నారు. తొక్కిసలాటలో రేవతి మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న పవన్ కల్యాణ్, బాధిత కుటంబాన్ని అల్లు అర్జున్ కానీ, ఆయన తపున ఎవరో ఒకరు ముందుగానే వెళ్లి పరామర్శించి ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయపడ్డారు.
బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేసుంటే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ మొత్తం ఎపిసోడ్ లో మానవతా దృక్పదం లోపించిందన్నారు. సంఘటన జరిగిన తర్వాత రేవతి కుటంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వక పోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్లో ముందు వెనుక ఏమి జరిగిందో తెలియదని, కానీ తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉందన్నారు.
భద్రత గురించి ఆలోచించే ముసుగేసుకొని చిరంజీవి ఒక్కరే తన సినిమాలను చూసేవారని, తాను కూడా అలానే తన సినిమాలను చూసినట్లు చెప్పారు. సినిమా అంటే ఒక టీమిని, అందరి భాగస్వామ్యం ఉండాలని, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్టు కాదని తాను అభిప్రాయపడ్డారు.