కరీంనగర్, డిసెంబర్ 31 సమర శంఖం :-
గోదావరిఖనిలో పట్టపగలే కత్తిపోట్లు కలకలం సృష్టించాయి
గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కంప్యూటర్ సెంటర్ లో పనిచేసే నంది శ్రీనివాస్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు.
దీంతో కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసి, చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.