ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు.
‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగింది.
తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు’’ అని దిల్ రాజు పేర్కొన్నారు.