పార్ట్ టైం జాబ్ తో మహిళను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు.
లింకులను క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వాలంటూ మహిళకు వాట్స్అప్ మెసేజ్.
సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి 13 అకౌంట్ల కు 50 లక్షలు పంపించిన బాధితురాలు.
మరో 30 లక్షలకు పంపాలంటూ మహిళలకు గాలం.
మోసపోయానని తెలుసుకున్న మహిళ…తన తల్లిదండ్రుల తో పోలీసుల చెంతకు…..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.
తిరుపతిఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు ఆదేశాలతో.. రంగంలోకి దిగిన పోలీసులు.
1930 సైబర్ ఫిర్యాదుతో సైబర్ అకౌంట్ నుండి 7 లక్షల హోల్డ్.
గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దు.
పార్ట్ టైం జాబ్, పెట్టుబడుల పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మొద్దు.
అనుమానాస్పద గ్రూపుల్లో చేరకండి.
మీబ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోను పంచుకోవద్దు.
పొరపాటున సైబర్ నేరాల భారీన పడితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు.