శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంఖళవారం ఉదయం ఆలయ ఇన్చార్జి ఈ వో వేండ్ర త్రినాధ రావు ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు నడుమ దేవాలయ సిబ్బంది హుండీల లెక్కింపు నిర్వహించారు. గడచిన 40 రోజులకు గాను జరిగిన ఈ హుండీ లెక్కింపు లో శ్రీ వారికి నగదు రూపేణ రూ3,85,61,549లు ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈవో త్రినాధ రావు తెలిపారు.అలాగే భక్తులు సమర్పించిన కానుకల రూపేనా 383 గ్రాముల బంగారం,12-008 కేజీల వెండి లభించినట్లు ఈ ఓ పేర్కొన్నారు. పాత నోట్లు 500(23),1000(4),2000(7), అలాగే 20 విదేశీ కరెన్సీ సైతం హుండీలో ద్వారా లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో అన్ని విభాగాల సూపర్డెంట్లు, ఆలయ సిబ్బంది, సేవకులు, పాల్గొన్నారు.
చిన్న వెంకన్న హుండీ ఆదాయం రూ 3కోటి 85లక్షల 61లక్షల 549లు
Published On: January 7, 2025 4:29 pm
