పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలి – దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి.లకు 42% కేటాయించాలని పెద్దయెత్తున ఆందోళనకు హెచ్చరిక.

పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలని, దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి లకు 42% కేటాయించాలని, దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. భువనగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో   ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ…

అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ-మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సి లకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సం.రాలుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ దేశంలో బి.సి లను బిచ్చగాళ్ళను చేశారని విమర్శించారు. బి.సిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు – బర్రెలు –పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బి.సిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు.

చివరకు కులగణన చేసి బీసీల జనాభా కూడా లెక్కించడానికి ఈ అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావడం లేదు. లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని భయపడుతున్నారు. ప్రజలకు, కుక్కలకు, ఇతర జంతువులకు లెక్కలు ఉన్నవి కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవన్నారు. బీసీలకు కేంద్రస్థాయిలో ఒక్క స్కీము కూడా లేదు. కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదు.

భారతదేశం అగ్ర దేశంగా తయారవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు చదువుకునే పేద పిల్లలకు ఫీజులు కూడా కట్టే స్థితిలో లేదన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేది. కులతత్వం కనీస స్థాయికి వచ్చేది. బి.సిలకు ఏయే రంగాలాలో అన్యాయం జరిగిందో చూద్దాం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదు. ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది. అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజులలో లోక్ సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు. కాని 50 శాతం జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా! మన దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా యున్నవి. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని తెలిపారు.


పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు.బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ /ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్ను తీసుకురావాలని, ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ /బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బి.సి.లకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.కేంధ్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులాల వాది లెక్కలు సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ సంఘం బీసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ,పల్లగొర్ల మోదీరాందేవ్,వేముల రామకృష్ణ, నందగోపాల్, ఉదయ్, జయంతి, రవి యాదవ్, పుట్టా వీరేష్, గుండెబోయిన సురేష్,వంశీ, జంగయ్య,బాలస్వామి,బాలయ్య, తదితరులు పాల్గొన్నారు తదితరులు పోల్గొన్నారు.   

Join WhatsApp

Join Now

Leave a Comment