యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం లో నీళ్లు లేని బావిలో నక్క పడింది.. నక్కను చూసేందుకు గ్రామంలోని ప్రజలు బావి దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. గ్రామంలో ఎక్కడ అడవి లేకపోయినా నక్క ఎక్కడ నుండి వచ్చిందని స్థానికులు అనుకుంటున్నారు.. ఈమధ్య గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నయి.నక్కను బావిలో నుండి తీయడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.. స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు..
చౌటుప్పల్ లో నీళ్లు లేని బావిలో నక్క వీడియో.
Published On: January 31, 2025 10:12 pm
