అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.

అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజా శేఖర బాబు ఇ. పి. ఎస్. గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ.డి.సి.పి శ్రీ ఏ. శ్రీనివాస రావు గారి పర్యవేక్షణలో ఏ.సి.పి. శ్రీమతి కె. లతాకుమారి, నార్త్ ఏ. సి. పి. శ్రీమతి స్రవంతి రాయ్ గార్ల ఆద్వర్యంలో  టాస్క్ ఫోర్స్ మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు ఐదుగురు మహిళలను అడుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన ముగ్గురు పిల్లలను స్వాదీనం చేసుకుని, ఒక బాబుని విక్రయించగా వచ్చిన నాలుగు లక్షల రూపాయలను స్వాదినం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు:
1.  విజయవాడ, సితార సెంటర్ ఏరియాకు చెందిన బగళం సరోజినీ @ బలగం సరోజినీ (31  సం.)
2. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన షేక్ ఫరీనా (26 సం.)
3.  విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన షేక్ సైదాబీ  (33 సం.)
4. విజయవాడ నున్న ప్రకాష్ నగర్ ఏరియాకు చెందిన కోవ్వరపు కరుణ శ్రీ (25 సం.)
5.  విజయవాడ నున్న ప్రకాష్ నగర్ ఏరియాకు చెందిన పెదాల శిరీష (26 సం.)
వివరాల్లోకి వెళితే.. విజయవాడ సితార సెంటర్ కు చెందిన బలగం సరోజినీ అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక హాస్పిటల్ సమీపంలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయమై పిల్లలు లేని, సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేయు, నీకు డబ్బులు ఇస్తారు అని చెప్పగా సరేనని ఎగ్స్ డొనేట్ చేసి డబ్బులు తీసుకుంది. అప్పటి నుండి సులభంగా డబ్బులు వస్తున్నాయి అని మారికొంత మందికి చెప్పి వారితో డొనేట్ చేయించడం ద్వారా కమిషన్ క్రింద డబ్బులు తీసుకునేది. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన మహిళ పరిచయమై ఇలా కాకుండా పి

Join WhatsApp

Join Now

Leave a Comment