ఖమ్మం : ఉరేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన రోహిణి కుమార్(34) ఖమ్మం మండలం పల్లెగూడెంలో ఇటుక బట్టీలు చేసేందుకు వచ్చాడు. గత కొంతకాలంగా రోహిణి కుమార్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా బాగా మద్యం తాగి తోటి కార్మికులతో గొడవ పడి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం చూసేసరికే సమీపంలో గల సెల్ ఫోన్ టవర్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఎం రాజు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పైనుంచి కిందికి దించేందుకు అన్నం సేవా ట్రస్ట్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు బృందం సహకారంతో శవాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సెల్ ఫోన్ టవర్ కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Published On: January 11, 2025 10:35 pm
