కాకతీయ కళా వైభవానికి కొత్త కళ

కాకతీయ కళా వైభవానికి కొత్త కళ సంతరించుకోనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాందిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రామప్ప దేవాలయ అభివృద్ది రూ. 73 కోట్లు నిధులు కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. సాస్కి స్కిమ్ కింద తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయనున్నారు. రామప్ప కోటగుళ్లు, గణపసముద్ర సరస్సు అభివృద్ధి, వెంచర్లను అభివృద్ధి చేయనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పక్కనే రామప్ప చెరువు, దానికి సమీపంలో కోటగుళ్లు ఆలయం, గణపసముద్రం సరస్సు వంటి ప్రత్యేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. రామప్ప గుడికి వెళ్లిన పర్యాటకులు వీటిని చుట్టి వచ్చే టూరిజం డెవలప్ మెంట్ చేయబోతున్నారు. రామప్ప సర్క్యూట్‌లో టూరిస్టులు సౌకర్యంగా బస చేయడానికి కాటేజీలతో పాటు హస్తకళలబజార్, శిల్పాలగార్డెన్, యాంఫీథియేటర్, లేక్‌ వ్యూ కాటేజీలు, బొటానికల్‌ గార్డెన్, పిల్లల ఆట స్థలాలు, బోటింగ్‌ పాయింట్‌ నిర్మించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment