సచివాలయంలో నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరి గౌరీ శంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజల మనోభావాలతో కూడుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం తగదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
సచివాలయంలో ఈనెల తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో హైకోర్టును కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేసేలా జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో కీలకపాత్ర పోషించిందని పిటిషన్ లో తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్, మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఎంతోమంది మేధావులు కలిసి విగ్రహాన్ని రూపొందించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు, ఇప్పుడు విగ్రహా రూపంలో ఎన్నో మార్పులు చేశారని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అన్నారు దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విగ్రహాన్ని మార్చొద్దని జూలూరి గౌరీ శంకర్ పిటిషన్ లో కోరారు.
ప్రజాప్రయోజన వ్యాజ్యం ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.